Breaking News

రైతుబీమాలో నమోదు అయిన రైతులకు ఆగస్టు 15న ఎస్.ఎం.ఎస్. ద్వారా బీమా సమాచారం అందిస్తామన్న వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్.

రైతుబీమాలో నమోదు అయిన రైతులకు ఆగస్టు 15న ఎస్.ఎం.ఎస్. ద్వారా బీమా సమాచారం అందిస్తామన్న వ్యవసాయ ముఖ్య  కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్.

10 జూలై, 2018 న తెలంగాణ సచివాలయం డి బ్లాకు సమావేశ మందిరం లో ఎల్.ఐ.సి. అధికారులు, వ్యవసాయ అధికారులు, ఎన్.ఐ.సి. అధికారులతో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్., రైతు బీమా నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్ మాట్లాడుతూ…. ఎల్.ఐ.సి. వారికి రైతుబీమా కింద నమోదు అయిన రైతుల డాటా దశల వారీగా ఎప్పటికప్పడు అందజేయాలని కోరారు. రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులందరికీ ఇన్సూరెన్సు సర్టిఫికేట్లు అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులందరికీ 15 ఆగస్టు, 2018 న రైతు బీమా సమాచారాన్ని ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియజేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా క్లెయిము వివరాలను కూడా ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియజేసే వెసలుబాటు కల్పించినట్లు చెప్పారు. ఎన్.ఐ.సి. అధికారులు రైతుబీమాకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎల్.ఐ.సి. తమకు కావాల్సిన సమాచార అంశాలను ఎన్.ఐ.సి. కి సూచించారని అన్నారు.

వ్యవసాయ శాఖలోని సహాయ వ్యవసాయ సంచాలకులకు, వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం ఉందని, వ్యవసాయ విస్తరణాధికారుల ట్యాబులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం సంవత్సర కాలానికి ఇంటర్నెట్ సౌకర్యం అందజేస్తున్నట్లు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి తెలియజేసారు. దీనివల్ల సమాచారం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచే అప్ డేట్ చేయడం సాధ్యమౌతుందని అన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు అఫ్ డేట్ చేసిన రైతుబీమా డాటాను వ్యవసాయ అధికారులు యుద్ధప్రాతిపదికన పరిశీలించి ప్రామాణీకరించాలని వ్యవసాయ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. వ్యవసాయ అధికారులు సమాచారాన్ని ప్రామాణీకరించాకనే ఆ డాటాను ఎల్.ఐ.సి. వారికి అందజేయడం సాధ్యమౌతుందని అన్నారు. పట్టాదారు పాసుబుక్కులు కలిగిన, ఇటీవల సాగుకు పెట్టుబడి చెక్కులు అందుకున్న, 18 నుంచి 59 సంవత్సరాలు వయస్సు కలిగిన రైతులందరూ రైతుబీమా అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని వ్యవసాయ ముఖ్య కార్యదర్శి కోరారు. రైతుబీమాలో ఇంకా నమోదు చేసుకోని రైతులు త్వరితగతిన ఎక్కడికక్కడ వ్యవసాయ విస్తరణాధికారులను లేక వ్యవసాయ అధికారులను సంప్రదించి వెంటనే రైతుబీమాలో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. నమోదు చేసుకున్న రైతులు నామినీ పేరు ఇవ్వాలని అన్నారు. నామినీ మైనరు అయితే ఒక మేజరు అపాయింటీ లేక సంరక్షకుల పేరు తెలియజేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *