రైతుబంధు – రైతు బీమా నమోదు కార్యక్రమం పై సమీక్షించిన వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్

 హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్సు హాల్లో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. గారు జిల్లా వ్యవసాయాధికార్లతో రైతుబంధు – రైతుబీమా నమోదు కార్యక్రమం పురోగతిపై సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 3565611 (73 శాతం) రైతుల నమోదు కార్యక్రమం పూర్తైందని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పడు రైతులు ఇచ్చిన నామినేషన్ ఫారాల తనిఖీని పూర్తి చేయాలని, త్వరితగతిన సమగ్రమైన సమాచారాన్ని భారత జీవిత బీమా సంస్థకు అందజేయాల్సి ఉంటుందని అన్నారు. మనం పూర్తి సమాచారం ఇస్తేనే జీవిత బీమా సంస్థ రైతులకు బీమా సర్టిఫికేట్లను 15 ఆగష్టు, 2018 కల్లా అందజేయడానికి వీలవుతుందని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ఉపేక్షించేది లేదని తెలిపారు. జిల్లా మరియు గ్రామాల వారీగా నమోదు కాకుండా మిగలిపోయిన రైతుల వివరాలను MIS Portal లో పొందుపర్చామని, వాటిని గ్రామ పంచాయితీలలోని నోటిసు బోర్డులలో అంటించాలని, అలాగే రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో ఆయా రైతులకు తెలియజేయాలని, వారి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని తద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు బీమా పథకం అందేలా చూడటమే లక్ష్యమని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. బీమా నమోదు వివరాలను ఎప్పటికప్పడు MIS Portal లో Upload చేయాలని, ఇప్పటి వరకు 89% అయ్యిందని తెలిపారు. అప్ లోడ్ అయిన డాటాను మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు Authenticate చేయాలని తెలిపారు. ఆ డేటానే అంతిమంగా భారత జీవిత బీమా సంస్థకు పంపవలసి ఉంటుందని అన్నారు. అందుకనే మండల వ్యవసాయ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.

ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. మాట్లాడుతూ..

రైతుబంధు పథకం కింద పంపిణీలో మిగిలిపోయిన చెక్కులను సత్వరమే కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని, అలాగే మిగిలిపోవడానికి గల కారణాలను తెలియజేయాలని అన్నారు. ఈ విషయంలో తాత్సారం జరిగితే ఉపేక్షించబోమని వ్యవసాయ శాఖ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. గారు ఆదేశించారు. కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు పొందే రైతులలో అర్హత ఉన్నవారికి తప్పకుండా రైతు బీమాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రతి జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ తో, మండల అధికారులు తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని వాటి వివరాలు సేకరించాలని, దాని ప్రకారం రైతు బీమా నమోదు కార్యచరణ చేసుకోవాలని కోరారు. అలాగే కొత్త పాసు బుక్కులు పొందిన రైతుకు గతంలో రైతుబంధు చెక్కులు ఇవ్వబడినవా లేదా అనే వివరాలను గ్రామాల వారిగా సేకరించి, జిల్లా అధికారులు కొత్త పాసుబుక్కులలో ఎన్ని చెక్కులు ముద్రించి ఇవ్వాలో కమీషనర్ కార్యాలయానికి సమాచారం వెంటనే తెలియజేయాలని, అప్పుడే వాటిని ముద్రించడానికి వీలవుతుందని తెలియజేసారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. రైతుబీమా వివరాలను గ్రామ వారిగా నోటిపై చేయాలని కోరారు. మంత్రి గారు టెలిఫోన్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికార్లకు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు మాట్లాడుతూ… అనర్హులైన రైతుల వివరాలు మండలాల వారిగా కారణాలు వివరంగా తెలియజేయాలని అన్నారు. కొత్త పాసు బుక్కులు పొందిన రైతులను నమోదు చేయవలసినదిగా ఆదేశించారు. ఏ ఒక్క అర్హులైన రైతును కూడా వదలకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతు బీమా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు వ్యవసాయ సంచాలకులు కె. విజయ కుమార్ మరియు రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

c pardha saradhi 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *