Breaking News

రైతాంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

రైతాంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): తెలంగాణ రైతాంగం కెసిఆర్ సర్కారు పట్ల ఆగ్రహంతో ఉందని టీ టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డితో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు సమస్యలపై ఏడాదిగా టిడిపి పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రాష్ర్టంలో ఇప్పటి వరకు కరువు మండలాలను గుర్తించలేదని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలం గడుస్తున్న ఏం చేసిందని ప్రశ్నించిన రైతు కొమురయ్యను సైకో అంటూ పోలీసుల చేత దాడి చేయించారని విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రాష్ర్టంలో కష్టనష్టాలకోర్చి పండించిన పంటకు మద్ధతు ధర లేక మార్కెట్ కార్యాలయాలపై దాడులు చేస్తున్నా మంత్రుల్లో చలనం లేదన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టిడిపి, బిజెపి పార్టీల మధ్య సఖ్యత లేదంటూ వార్తల్లో వాస్తవం లేదని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుడికి టికెట్ ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్న టిఆర్ఎస్ నేతలకు రైతులు నిరుద్యోగులే బుద్ధి చెబుతారన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *