రైతన్న కుదేలు.. వినియోగదారుడికి పసందు

SO15_p_032_001_web

అసలే కరువు.. నీటి కొరత తీవ్రం.. ఇలాంటి పరిస్థితుల్లో బోర్ల కింద 3 నెలల పాటు అష్టకష్టాలు పడి పండించిన టామాట పంటకు మార్కెట్లో డిమాండ్ లేకుండాపోయింది. రూ.1 కే కిలో టామాటకు ధర పడిపోవడంతో రైతన్నలు కుదేలవుతున్నారు. మెదక్, హైదరాబాద్ మార్కెట్లో కిలో టమాట రూ.1కే పడిపోయింది. 25 కిలోల టమాట బాక్సు ధర 20కే పడిపోవడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నాడు..
కాగా వినియోగదారులు మాత్రం టామాట ధర పడిపోవడంతో పండుగ చేసుకుంటున్నారు. ఓక్కొక్కరు 5 కిలోల వరకు కొని పచ్చళ్లు, టామాటతో వెరైటీలు చేసుకుంటున్నారు. రోజూ టమాటనే చేసుకుంటూ విందు చేసుకుంటున్నారు. మళ్లీ ఎండాకాలంలో చుక్కలు చూపించనున్న టామాట ఇప్పుడు దిగుబడి పెరిగి ధర తగ్గడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. రైతులు మాత్రం నష్టపోతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *