
హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ లో విచ్చలవిడి శృంగారానికి హద్దే లేకుండా పోయింది. హైదరాబాద్ సిటీ శివారులో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్పై దాడి చేసిన పోలీసులు, సుమారు 40 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో పదిమంది యువతులతోపాటు 30 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని పోలీస్ట్ స్టేషన్‌కు తరలించి విచారణ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆ తరహా పార్టీలపై ఖాకీలు నిఘా పెట్టారు. కొద్దిరోజుల కిందట సైబారాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఓ ఫామ్హౌస్పై దాడి చేసిన విషయం తెల్సిందే! మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫాంహౌస్ యాజమాన్యాలను పోలీసులు హెచ్చరించారు. ఇంత చేస్తున్నా ఈ రేవ్ పార్టీల నియంత్రణ ఆగడం లేదు. ఈ పార్టీల్లో ముఖ్యంగా సిటీ శివారులోని ఫాంహౌస్ ల్లో ఎక్కవుగా జనసంచారం లేని చోట్లలో నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందక అరికట్టలేకపోతున్నారు.