
హైదరాబాద్ : నామినేటెడ్ ఎమ్మెల్సీకి డబ్బులు ఆశచూపి అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అంతకుముందు ఆయన అసెంబ్లీలో తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేశారు.
అనంతరం అసెంబ్లీలో ఎన్నికల కేంద్రం వద్దనే ఉన్న రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారి రేవంత్ ను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని చంచల్ గూడ కు తరలించారు.