
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డికి కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈనెల 15వ తేదీ వరకు ముగ్గురికి రిమాండ్ పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. మరికాసపట్లో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. 4 రోజుల కస్టడీ అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరుచగా 15వరకు రిమాండ్ పొడిగించారు.