రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ మంజూరు అయ్యింది. ఆయన ఇవాళ సాయంత్రం 7 గంటలకు  లేదా రేపు ఉదయం విడుదల కానున్నారు. కాగా రేవంత్ బెయిల్ ఇవ్వవద్దంటూ తెలంగాణ ఏజీ రామకృష్ణరెడ్డి చేసిన వాదనలు కోర్టు తోసిపుచ్చింది. సాక్ష్యాలు తారు మారు చేస్తారు. పక్క రాష్ట్రంలో వారి అధికారంలో ఉంది బెయిల్ ఇవ్వద్దని వాదించారు. కానీ కోర్టు ఏజీ వాదనలతో ఏకీభవించలేదు.. సాక్ష్యాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయని.. టెక్నికల్ అసెట్స్ అన్ని రాకర్డు అయ్యాయని.. ఇక సాక్ష్యాలు తారుమారు కాదని.. అందుకే ఇక రేవంత్ కు బెయిల్ ఇస్తున్నామని కోర్టు పేర్కొంది.

రేవంత్ తో పాటు ఉదయసింహా, సెబాస్టియన్ లకు బెయిల్ మంజూరు చేసింది. వీరందరికీ 5 లక్షల ష్యూరిటీని సమర్పించాలని కోర్టు సూచించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *