
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై వాదనలు మరోసారి వాయిదాపడ్డాయి. రేవంత్ పిటీషన్ విచారణను న్యాయస్థానం శుక్రవారం మధ్యాహ్నం వరకు వాయిదా వేసింది.
రేవంత్ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని.. దాంతో అనుబంధ పిటీషన్ వేస్తామని సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది ఏజీ రామకృష్ణారెడ్డి కోర్టును కోరారు. దీంతో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.