రేవంత్ బెయిల్ పిటీషన్ మంగళవారానికి వాయిదా..

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ సిద్దార్థ రేవంత్ కు బెయిల్ ఇవ్వాలని కోరారు. రేవంత్ ప్రజాప్రతినిధి అని.. దీంతో షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని రేవంత్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

కాగా ఏసీబీ తరఫున తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణ రెడ్డి వాదించారు. రేవంత్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని.. ఇంకా చాలా సాక్ష్యాలు సేకరించాల్సి ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *