రేవంత్ కేసులో బుక్కైన చంద్రబాబు

-రేవంత్ వ్యవహారంలో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన టేపులు బహిర్గతం
-తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన రాజకీయం
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యాడు. రేవంత్ ముడుపులు ముట్టజెప్పిన అనంతరం స్టీఫెన్ సన్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు మీడియాకు లీక్ కావడం కలకలం రేపాయి. ఈ టేపులు అన్ని మీడియా చానాళ్లలో మోతమోగాయి. ఇందులో స్టీఫెన్ సన్ కు ముడుపుల వ్యవహారం పై చంద్రబాబు స్టీఫెన్ కు భరోసా ఇచ్చి అవినీతికి పాల్పడినట్టు రుజువైంది. స్టీఫెన్ కు రేవంత్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చంద్రబాబు ఆ ఆడియో టేపుల్లో పేర్కొన్నారు.

ఈ ఆడియో టేపులతో పరిస్తితి ఒక్కసారిగా వేడెక్కింది. రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఆడియో టేపులు విడుదలైన తర్వాత కేసీఆర్ గవర్నర్ తో భేటి అయ్యారు. అంతకుముందు గవర్నర్ తో చంద్రబాబు భేటి అయ్యారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వార్ నడుస్తున్నట్టే కనిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *