
-మేం తెల్లకాగితంలా బయటపడతాం
-స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని కోర్టులు చెప్పాయి
-మంత్రి రావెల కిషోర్ బాబు
హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీని, రేవంత్ ను దెబ్బతీసేందుకు జగన్ తో కలిసి కేసీఆర్ కుట్రపన్నారని.. రేవంత్ కు బెయిల్ రావడం తమ నైతిక విజయమని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ జగన్ లు ఆడిన నాటకం బట్టబయలైందన్నారు. రేవంత్ కు బెయిల్ వచ్చిందో ఇది కేసీఆర్ కుట్ర అని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. బూటకపు స్టింగ్ ఆపరేషన్లు, వాయిస్ టేపులతో ఏపీ సీఎం చంద్రబాబు గౌరవాన్ని మంటగలిపారన్నారు. చివరకు వారి కుట్ర రాజకీయాలకు వారే బలయ్యారన్నారు. స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని చెప్పినా వినిపించుకోరా అని మండిపడ్డారు.