Breaking News

రేపు యాదాద్రికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రేపు యాదాద్రికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఆల‌య అభివృద్ది,విస్త‌ర‌ణ‌ ప‌నుల ప‌రిశీల‌న … స‌మీక్ష

హైద‌రాబాద్ , జ‌న‌వ‌రి 28:  గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  సోమ‌వారం  యాదాద్రి లక్ష్మీనరింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆల‌య అభివృద్ది, విస్త‌ర‌ణ పనుల‌ను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. గ‌ర్భ‌గుడి చుట్టూ ప్ర‌ధాన ఆల‌య నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా నిర్మిస్తున్న‌క్యూ కాంప్లెక్స్ లు, వ‌స‌తి గృహాల నిర్మాణాలు, మంచి నీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ,సుందరీక‌ర‌ణ ప‌నుల‌పై అధికారుల‌తో స‌మీక్షిస్తారు.  ఆల‌య అభివృద్ది ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, విస్త‌ర‌ణ‌ ప‌నులు వేగ‌వంతంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *