రేపు ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుష్కరస్నానం

dharma puri

సీఎం కేసీఆర్ ఈనెల 14 నుంచి 25 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొననున్నారు. కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద పుష్కరస్నానం చేయనున్నారు. ఇందుకోసం ధర్మపురిలో భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. అన్ని బాగానే ఉన్నా ఇక్కడ నీటి జాడ కరువైంది. కేవలం మోకాళ్ల వరకు మాత్రమే పాయలాగా నీరు పారుతోంది.

కాగా పుష్కరాల కోసం నిజామాబాద్ జిల్లాలోని పెద్ద ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీ నుంచి , ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటిని ఈ ఉదయం విడుదల చేశారు అధికారులు.. రేపు ఉదయం 6.30కు సీఎం కేసీఆర్ ధర్మపురిలో పుష్కరస్నానం చేసి పుష్కర మహోత్సవాలను ప్రారంభించారు. కాగా కేసీఆర్ ధర్మపురిలో స్నానం చేయనుండడంతో ఇక్కడ నీటిని తీసుకొచ్చేందుకు ఎస్సారెస్పీ, కడెం నీటిని విడుదల చేశారు. ఈ నీరు రేపు ఉదయం వరకు ధర్మపురి వద్దకు వచ్చే అవకాశం ఉంది.

కాగా మంత్రులు  జోగురామన్న, కేటీఆర్ లు బాసరలో పుష్కరస్నానం చేసి పుష్కరాలను ప్రారంభిస్తారు. చిన్నజీయర్ స్వామి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భద్రాచాలంలో పుష్కరాలను స్నానం చేసి ప్రారంభిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *