
ఢిల్లీ, ప్రతినిధి : ప్రభుత్వరంగ బ్యాంకులు రేపు(బుధవారం) బంద్ పాటించనున్నాయి. జీతాలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ బ్యాంకు సిబ్బంది ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో చెక్కుల క్లియరెన్స్ లతో పాటు ఆర్థిక లావాదేవీలు స్థంభించనున్నాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లుగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యుఎఫ్ బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ తెలిపారు.