Breaking News

రేపు ఢిల్లీలో కృష్ణా, గొదావరిలొ న్యాయమైన వాటా పై పోరు

రేపు ఢిల్లీలో కృష్ణా, గొదావరిలొ న్యాయమైన వాటా పై పోరు

తెలంగాణకు కృష్ణాలో 575 టి.ఏం.సీలు

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.

రేపు ఢిల్లీలో సమావేశం.

కృష్ణా, గోదావరిలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటా పై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో గురువారం జరగనున్న సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై బుధవారం ఇక్కడ జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా చర్చించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలపై మంత్రి హరీష్ రావు సమీక్షించారు.తెలంగాణలోని చారిత్రక భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయం సహా పలు గ్రామాలు, బొగ్గు గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ తదితర ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.భద్రాచలం పట్టణం దాని చుట్టుపక్కల గోదావరి పరీవాహక ప్రాంతంలో 124 కిలోమీటర్ల మేరకు పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ప్రభావిత ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ని ఆదేశించవలసిందిగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉన్నతాధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు.బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం కు కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 45 టి.ఏం.సి ల నీటిని వినియోగించుకునే హక్కు దక్కుతుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం కేంద్రమే జాతీయప్రాజెక్టుగా పోలవరంను చేపట్టినందున ఆ 45 టి.ఏం.సి.ల నీటిని తెలంగాణకు కేటాయించాలని హరీష్ రావు కోరారు. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల కింద 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూములున్నప్పటికీ కేవలం 5.75 (15 శాతం ) లక్షల హెక్టార్ల భూమికి మాత్రమే సాగునీరు అందుతున్నదాని ఈరిగేషన్ మంత్రి అన్నారు. 45 టి.ఏం.సి.ల నీటిని తెలంగాణకు కేటాయిస్తే నీరందని ప్రాంతాల్లో సాగుకు వాడుకుంటామని ఆయన చెప్పారు.ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి గోదావరి జలాలను వాడుకుంటున్నట్టు కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు..

పట్టిసీమ లోనూ 45 టి.ఏం.సి.ల నీరు తెలంగాణ వాటా ఉందని ఆయన అన్నారు. మొత్తంగా రెండు రాష్ట్రాలకు కృష్ణాలో కేటాయించిన 811 టి.ఏం.సి.లలో తెలంగాణకు 575 టి.ఏం.సీలు కేటాయించి ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని గురువారం డిల్లీలో కేంద్రాన్ని కోరాలని ఆదేశించారు..రాజోళి బండ డైవర్షన్ స్కీమ్ కింద రాష్ట్రానికి 15.9 టి.ఏం.సిల నీటి కేటాయింపూలు ఉన్నప్పటికీ వాస్తవంగా సగటున 4.56 టి.ఏం.సి.లకు మించి రావడం లేదని హరీష్ రావు తెలిపారు. ఆర్.డి.ఎస్. కాలువల ఆధునీకరణ చేపట్టాలని 2004 లో నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఈ పనులు ముందుకు సాగలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా ఏ.పి. అనేక అడ్డంకులు సృష్టిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని మంత్రి కోరారు . నిపుణుల కమిటీ గతంలో చేసిన సిఫారసుల మేరకు ఆర్.డి.ఎస్. ఆధునీకరణ పనులు వేగవంతమయ్యేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని డిల్లీ సమావేశంలో కోరాలని ఆదేశించారు..ఇక శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద నీటి వాడకాన్ని లెక్క గట్టేందుకు తెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని 2016 జూన్లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించినప్పటికీ కె.ఆర్.ఏం.బి.వాటిని అమలు చేయలేదన్నారు.తొలివిడతలో 19 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు 2017 ఫిబ్రవరిలో కె ఆర్ ఏం బి ప్రతిపాదించింది.కానీ ఆ టెలిమెట్రీ స్టేషన్లు పనిచేయడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. రెండో విడత టెలిమెట్రీ స్టేషన్ల జాబితా ను ఇంతవరకు ఖరారు చేయకపోవడం పట్ల మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు.ముఖ్యమైన నీటి మళ్లింపు ప్రాంతాల వద్ద టెలిమెట్రీ స్టేషన్ ల ఏర్పాటులో జరుగుతున్నా జాప్యం వల్ల పోతిరెడ్డిపాడు కింద అధిక నీటిని కృష్ణా బేసిన్ అవతలకు అక్రమంగా తరలిస్తున్నట్టు హరీష్ రావు ఆరోపించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈ.ఎన్.సి.లు మురళీధర రావు,నాగేందర్ రావు,సి.ఈ.లు సునీల్, ఖగేందర్ రావు,లింగరాజు,హరిరామ్, బంగారయ్యశంకర్,భగవంతరావు తదితరులు పాల్గొన్నారు.

harish rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *