Breaking News

రేపు అమెరికా పర్యటనకు కేటీఆర్

ktr

హైదరబాద్: తెలంగాణ పారిశ్రామిక విధానం( టీఎస్ ఐపాస్) కు ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో  తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సమకూర్చే లక్ష్యంతో మం త్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఆయన రెండు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.

ఈనెల 6న వాషింగ్టన్ డీసీ, 7న న్యూయర్కు,8న పిట్స్ బర్గ్, 9న డల్లాస్ లో పర్యటించనున్నారు.అక్కడ ఆయన సాంకేతిక, పారిశ్రామిక వేత్తలతో భేటి కానున్నారు. అమెరికాలోని భారత రాయబారి అరుణ్ కే సింగ్ తో భేటి కానున్నారు.

ఐటి, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ స్పేస్ రంగాలపై కేటిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రవాస భారతీయులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *