
నాగాలాండ్ లో ఓ మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని జైలులో ఉంటే జైలు గోడలు బద్దలు కొట్టి నిందితుడిని వీధుల్లో నగ్నంగా ఊరేగించి కొట్టి చంపారు జనం. ఈ ఘటన గురువారం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సయ్యద్ ఫరీద్ ఖాన్ (35) అనే కార్ల డీలర్ ఇరవయ్యేళ్ల నాగాలాండ్ యువతిపై రెండు రోజులు నిర్భంధించి అత్యాచారం చేశారు. అతడిపై కేసునమోదై అరెస్ట్ కావడంతో జైల్లో వేశారు.
కాగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సుమారు నాలుగువేల మంది స్థానికులు ఆగ్రహంతో నిందితుడు ఉన్న జైలు వద్దకు ర్యాలీగా వెళ్లి జైలు గోడలు బద్దలు కొట్టి నిందితుడిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం బట్టలు విప్పి నగ్నంగా వీధుల్లో నడిపించి సిటీ సెంటర్ వరకు తీసుకెళ్లారు. అక్కడే అతన్ని కట్టేసి తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు. ఈ ఘటన నాగాలాండ్ లోని దిమాపూర్ జిల్లాలో జరిగింది.