Breaking News

రేణుక కోసం విమానం 45 నిమిషాల లేటు

renuka-chowdhury-ndtv_02

న్యూఢిల్లీ, ప్రతినిధి : ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి కోసం ఎయిర్ ఇండియా విమానం 45 నిమిషాలు లేట్ గా బయలుదేరింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఎయిర్ ఇండియా యాజమాన్యం చిక్కుల్లో పడింది.

శనివారం సాయంత్రం షికాగో నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలో ఆగిపోయింది. ఈ విమానంలోనే సుప్రంకోర్టు న్యాయమూర్తి తో పాటు ఓ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో బయలు దేరకపోవడంతో ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారులను నిలదీశారు. ఎందుకు ఆపారంటూ ప్రశ్నించారు. ఓ వీఐపీ రాలేదని ఆమె కోసం విమానం ఆపామని వారు బదులిచ్చారు.

కాగా షాపింగ్ కు వెళ్లిన రేణుకా చౌదరి.. తీరిగ్గా 45 నిమిషాలు లేట్ గా విమానంలోకి ప్రవేశించారు. పైగా విమాన అధికారులపై మండిపడ్డారట.. సామన్యులకు ఒక్క నిమిషం కూడా ఆగని ఎయిర్ ఇండియా విమానాలు వీఐపీల సేవల్లో తరిస్తాయనడానికి ఇదే ఉదాహరణ అంటూ ప్రయాణి కులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *