రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఆస్తుల వివరాల నమోదు

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో అన్ని శాఖలు గ్రామాల వారిగా తమకు సంబందించిన భూములు, ఆస్తుల వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

శనివారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా.రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు    శ్రీ సురేష్ చందా,శ్రీ ఎస్ కె.జోషి,  శ్రీ అజయ్ మిశ్రా, శ్రీ రాజేశ్వర్ తివారీ, శ్రీ బి.ఆర్ మీనా,   శ్రీ బి.పి ఆచార్య,శ్రీమతి చిత్రా రామచంద్రన్, ముఖ్య  కార్యదర్శులు శ్రీ  సునీల్  శర్మ, శ్రీ అశోక్ కుమార్, శ్రీ వికాస్ రాజ్, శ్రీ శశాంక్ గోయల్, శ్రీ రామకృష్ణారావు,శ్రీ సోమేష్ కుమార్, శ్రీ జయేష్ రంజన్, శ్రీ రజత్ కుమార్,  కార్యదర్శులు శ్రీ  బి.వెంకటేశం, శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా,  శ్రీ శివశంకర్, శ్రీ నవీన్ మిత్తల్, శ్రీ ఒమర్ జలీల్, శ్రీ జగధీశ్వర్, శ్రీమతి అనితా రాజేంద్రన్,   పౌర సరఫరాల కమీషనర్ శ్రీ సి.వి.ఆనంద్, కళాశాల విద్యా కమీషనర్  శ్రీమతి వాణి ప్రసాద్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శ్రీమతి శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా గ్రామాలలో పర్యటించే రెవెన్యూటీంలకు ఆ శాఖల  అధికారులు తమ శాఖకు సంబంధంచిన భూసమాచారాన్ని,గ్రామాల్లో పర్యటించే రెవెన్యూ టీం లకు అందించటంతో పాటు  జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు సమర్పించాలన్నారు. ఈ విషయమై శాఖల వారిగా ప్రత్యేకంగా సమీక్షించాలని, కార్యదర్శులకు సూచించారు. రికార్డుల పరిశీలన అనంతరం ఆయా శాఖల పేర్ల మీద మ్యూటేషన్ జరుగుతుందన్నారు.

ఎస్సి,ఎస్టీ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల ఖర్చును వేగవంతం చేయాలని, శాఖలు ఎస్సీ,ఎస్టీ లకోసం అమలు చేస్తున్న  వివిధ పథకాల వివరాలు, లబ్ధిదారుల జాబితాను  సిజిజి పోర్టల్ కు అప్ లోడ్ చేయాలన్నారు. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్ట్రూట్ మెంట్ వివరాలను ఆర్ధిక శాఖకు సమర్పించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనుమతించిన ఖాళీలకు సంబంధించి అవసరమైన వివరాలను టిఎస్ పిఎస్ సి కి సమర్పించాలన్నారు. తమతమ శాఖలలో ఉన్న ఖాళీలపై ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు.

sp singh1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *