Breaking News

రెడ్డప్పా.. నీ తీరేందప్పా..

JC-Diwakar-Reddy-stunning-comments-against-Pawan-Kalyan

జేసీ దివాకర్ రెడ్డి రాయలసీమ యాసలో తిడుతుంటే మీడియా కెమెరాలన్నీ బ్రేకింగ్ న్యూస్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తాయి.. రాజకీయాలలో ముదరు సీనియర్ నాయకుడు ఎవరిని వదలడు.. ఆఖరకు సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని చూడడు.. ఎవరిది తప్పైతే వారిని కడిగేస్తుంటాడు.. అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల అనంతపురంలో చేసిన వ్యాఖ్యల్ని ఎవరిని ఉద్దేశించి చేసినవో అర్థంకాక స్టేజ్ మీద ఉన్నవాళ్లందరూ జుట్టు పీక్కున్నారు. చంద్రబాబును తిడుతున్నాడో , పొగుడుతున్నాడో తెలియక అవాక్కయ్యారు.

గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన జేసీ ఆ పార్టీ స్వేచ్ఛను టీడీపీలోనూ కొనసాగిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు కళ్లప్పగించి చూస్తున్నారని.. ఆయన పోలీసులను ఆదేశించి ఏపీలో అసలు అప్పు పుట్టకుండా చూశాడని మండిపడ్డారు. సొంత పార్టీ అధినేతపైనే విమర్శలు చేసి జేసీ చిక్కుల్లో పడ్డారు. అయినా సీనియర్ కావడంతో చంద్రబాబు ఏమీ అనలేని పరిస్థితి..

ఈ మధ్య అనంతపురం మీటింగ్ లో జేసీ ‘ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ’ కరాఖండీగా చెప్పారు. అంతేకాదు.. ‘సీఎం, పీఎంలకు ఎన్నికలు పెడితే సరిపోతుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా చిల్లర దందా వృథా అంటూ మండిపడడం టీడీపీ నేతలనే విస్మయపరిచింది.. జేసీనా మజాకా అని అక్కడున్న వారు గుసగుసలాడారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *