రెడీ ‘అవుతున్న కొలంబ‌స్‌’

సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ‘కొలంబస్’.   ‘డిస్కవరింగ్ ల‌వ్’ అనేది ఉపశీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి.  యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్ మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో న‌టించాడు. ఇష్క్ సినిమా ర‌చ‌యిత‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌.సామ‌లను ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వ‌ర‌లో పాట‌లను, వ‌చ్చే నెల 13న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి“ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర
sumanth301sumanth

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *