రెడీమేడ్ గోడలు వచ్చేశాయి..

-తక్కువ ఖర్చు.. ఒక్కరోజులో గోడ..

-అంతా వారిదే నిర్మాణం..
-చదరపు ఫీటుకు రూ.80 నుంచి రూ.110 వరకు గోడ రేటు.
==================================
ఖాళీ స్థలం కనపడితే కబ్జా అయిపోతున్న రోజులివి.. ఇక స్వంత ఇళ్లు కట్టుకున్న వారికి జాగా కాపాడుకోవడమూ.. ఇరుగుపొరుగువారితో గొడవ రాకుండా ప్రహరీ కట్టుకోవడం చాలా ముఖ్యమైన పని అయిపోయింది. అంతేకాదు నగరాల్లో ఉంటున్న ప్రతీ ఒక్కరూ తమ ఇంటి చుట్టు ఖచ్చితంగా ప్రహరీ కట్టుకోవాల్సిందే లేదంటే.. ఇంట్లోకి పందులు, పశువులు వచ్చే సి నానా రచ్చ చేసేస్తాయి.. ఇన్ని ఇబ్బందులున్నాయి.. కాబట్టే ఖాళీ స్థలాలకు, కొత్త ఇళ్లకు, పాత ఇళ్లకు ప్రహరీ అనే ఒక ముఖ్యమైన అవసరంగా మారిపోయింది..

ప్రజల అవసరాల్లోంచే గెట్ ఐడియా..
ప్రహరీ నిర్మాణం చేయాలంటే భారీ ఖర్చు లక్షలు ఖర్చు చేయాల్సిందే.. దీంతో పాటు ఇసుక, సిమెంటు, కంకర, ఇనుము ఇలా అన్ని కొని నిర్మాణం చేయాలి. మేస్త్రీకి భారీగా ఖర్చు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రహరీలకే లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.. అందుకే ప్రజల అవసరాల్లోంచే కొత్త ఐడియా పుట్టుకొచ్చింది.. అదే ‘రెడీమేడ్ గోడలు’. అంటే ఎక్కడో గోడలు పోస్తారు. వాటన్నింటిని మన ఇంటి చుట్టూ పేరుస్తారు. తీసుకొచ్చి పెడితే ఒక్కరోజులో ప్రహరీ రెడీ.. అలా సిమెంట్ తో తయారైన రెడీమేడ్ గోడలు ఇప్పుడు కరీంనగరంలో కొత్త పరిశ్రమగా వెలుగొందుతున్నాయి..

Photo1521

తక్కువ ఖర్చు.. ఒక్కరోజులో గోడ..
సిమెంట్ కాంక్రీట్ తో చాలా పటిష్టంగా తయారు చేయబడే ఈ రెడీమేడ్ గోడలు చూడడానికి ఆకర్షణీయంగా చాలా ఫ్యాన్సీ డిజైన్ లలో ఆకట్టుకుంటున్నాయి.. వీటిని మనం పెట్టుకున్న తరువాత భవిష్యత్తులో వేరే చోటికి కూడా తరలించుకునే విధంగా ఉంటాయి ఈ రెడీమేడ్ గోడలు. ముఖ్యంగా నగారల్లో తమ ఖాళీ స్థలాలు కాపాడుకోవాలనుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇతర సొంతంగా వేసుకునే కాంపౌండ్ వాల్ కంటే అతితక్కువ ఖర్చుతో దీన్ని ఒక్కరోజులోనే గొడను నిర్మించుకునేలా తయారుచేశారు.. గోడకు ఫీట్ల లెక్కన డబ్బులు తీసుకుంటారు. వారే గోడను కట్టి మనకు ఇఛ్చి వెళతారు. చదరపు ఫీట్ కు క్వాలిటీ ని బట్టి 80 నుంచి 110 రూపాయల వరకు రెడీమేడ్ గోడలుంటాయి.. మనం 80 ఫీటును ఎంచుకుంటే గోడను వారే కట్టి ఇచ్చి వెళతారు. మన ప్రమేయం ఏమీ ఉండదు. కేవలం ధర మాట్లాడుకుంటే సరిపోతుంది. దీనికి బేస్ మెంట్ కూడా అవసరం లేదు.. మొత్తం 8 ఫీట్ల పొడవుండే రెడీ మేడ్ గోడ తీసుకొస్తారు. అందులో రెండు ఫీట్లు భూమిలో పోతుంది. ఆ భూమిలో పోయే 2 చదరపు ఫీట్ల డబ్బులు మన దగ్గర తీసుకోరు.. పైన ఉన్న 6 ఫీట్లను లెక్కగట్టి డబ్బులు తీసుకుంటారు. మధ్యలో రెడీమేడ్ ఫిల్లర్లను వాటి మధ్యలో రెడీమేడ్ గోడను పెట్టి వారే మొత్తం నిర్మించి చివరకు చదరపు ఫీట్లను కొలిచి డబ్బులు తీసుకుంటారు. ఇందులో వ్యాసార్థంను బట్టి తీసుకుంటారు కాబట్టి చాలా తక్కువ ఖర్చులో గోడ నిర్మాణం అయిపోతుంది.

Photo1520

కరీంనగర్ లోని మాల్కాపూర్ రోడ్డులో ఈ రెడిమేడ్ గోడల తయారీ కేంద్రం ఉంది. జే అనిల్ కుమార్ అనే యువకుడు ఈ మిషన్ ను తెచ్చి కరీంనగర్ లో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్నానని.. వారానికి రెండు మూడు గోడల కాంట్రాక్టులు వస్తున్నాయని అనిల్ ఆంధ్రజ్యోతి తో తెలిపారు. 3 నుంచి 4 గంటల్లో అన్ని తీసుకొచ్చి మధ్యలో సిమెంట్ తో అతికి గోడను నిర్మిస్తామని తక్కువ ఖర్చు.. ఒక్కరోజులోనే గోడ రెడీ అనిల్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *