రెగ్యులర్ షూటింగ్ లో సునీల్ నూతన చిత్రం

స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకొని… కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సునీల్, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని… మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇటీవలే సినీ పెద్దల ఆశిస్సులతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మలయాళ హీరోయన్ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టింది. కీలకమైన ఈ షెడ్యూల్ ఈనెలాఖరు వరకు హైదరాబాద్ లో జరుగుతుంది. సునీల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ తో బిజీగా మారిన జిబ్రాన్ సంగీత దర్శకుడు కావడం, స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం.
     నిర్మాత మాట్లాడుతూ… మా దర్శకులు క్రాంతి మాధవ్ చక్కని కమర్షయిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందిచబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సునీల్ క్యారెక్టరైజేషన్ ను విభిన్నంగా మలిచారు. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చి దిద్దారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టాం. ఈనెలాఖరు వరకు హైదరాబాద్ లోనే శరవేగంగా షెడ్యూల్ జరుగుతుంది. వరుసగా సూపర్ హిట్ సాంగ్స్ అందిస్తున్న జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిస్తున్న పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.  అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ సర్వేశ్ మురారి కెమెరామెన్ గా పనిచేస్తుండడం చాలో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *