Breaking News

రెండో ప్రపంచయుద్ధం తరువాత మళ్లీ.. ఇప్పుడు..

france1

ఎందరో లక్షల మంది అమాయకుల ప్రాణాలను ఆకారణంగా తీసిన ఐఎస్ఐఎస్ ను అంతం చేయాలని దాని బాధిత అగ్రదేశాలు నిర్ణయించాయి. ఐఎస్ఐఎస్ పై దాడులకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల ప్రాన్స్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు దిగి 130 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.. దీంతో ఫ్రాన్స్ అట్టుడికిపోయింది. ప్రతీకారంతో రగిలిపోయింది. వెంటనే తమ యుద్ధవిమానాలతో సిరియాలోని ఐఎస్ఎస్ స్థావరాలపై విరుచుకుపడింది.  పదుల సంఖ్యలో విమానాలతో ఐఎస్ఐఎస్ స్థావరంపై యుద్ధానికి దిగింది..

ఇక ఫ్రాన్స్ కు తోడుగా అమెరికా, బ్రిటన్ కూడా తమ ఆయుధ సంపత్తిని, యుద్ధనౌకల సహకారాన్ని అందించి తోడ్పాటుగా నిలిచాయి.. కాగా ఇప్పుడు మరో అగ్రరాజ్యం రష్యా ఐఎస్ఐఎస్ పై యుద్ధానికి ఫ్రాన్స్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. రష్యా విమానం ఐఎస్ఐఎస్ కూల్చివేతకు ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షుడు ప్రకటించారు. ఫ్రాన్స్ బలగాలతో కలిసి రష్యా పనిచేయాలని తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఐరోపా సమాఖ్య కూడా ఐఎస్ పై పోరుకు సహకారం అందిస్తుండడంతో రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎక్కువ దేశాలు మళ్లీ యుద్ధరంగంలోకి దిగుతున్నాయి.. ఐఎస్ఐఎస్ అంతు చూడడానికి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *