రెండేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీ

-Tsps లోగో ఆవిష్కరించిన కేటీఆర్
హైదరాబాద్ : రాజ్ భవన్ లో శనివారం గవర్నర్ చేతుల మీదుగా Tsps లోగోను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో Tsps చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో ఖాళీగా ఉన్న లక్షా 7 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ కేసీఆర్ Tspsపై ఎంతో నమ్మకముంచారని.. నిరుద్యోగుల ఆశలు తీర్చేలా Tsps పనిచేయాలని కోరారు.

కాగా Tsps రూపొందించిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు సమస్త సమాచారం నిరుద్యోగులకు అందుతుంది. ఆద్యంతం కొత్త పంతాలో వెబ్ సైట్ ను రూపొందించిన కమిషన్ ను మంత్రి కేటీఆర్, గవర్నర్ అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *