Breaking News

రెండు రాష్ట్రాలకూ రెండు మద్దతు కార్టునులు

enadu cartoons

ఈనాడు దినపత్రిక రెండు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ, ఏపీలకు ప్రాధాన్యమిస్తోంది.. ప్రాధాన్యం అంటే అధికార టీఆర్ఎస్, టీడీపీలకే.. ఆ రెండు పార్టీలు కారాలు మిరియాలు నూరుకుంటున్నా.. వాటికి సమదూరంతో మచ్చిక చేసుకుంటోంది ఈనాడు.. ఏ ఎండకాగొడుగు పట్టడంలో ఆరితేరిన ఈనాడు సంస్థ తెలంగాణలో కేసీఆర్ కు కోపం రాకుండా.. అటు ఆది మిత్రుడు చంద్రబాబుకు లోటు రాకుండా వ్యవహరిస్తోంది..

తెలంగాణలో రామోజీ ఫిలిం సిటీ ఆస్తులుండడంతో వాటిని కాపాడుకోవడం అవసరం కనుక ఇక్కడ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాయడం లేదు.. ముందునుంచి తెలుగుదేశం చంద్రబాబుకు సపోర్ట్ గా ఉండే ఈనాడు అక్కడా అధికార పక్షానికే మద్దతు రాతలు రాస్తోంది..

ఇవాళ తెలంగాణలో కేసీఆర్ అమలుచేయనున్న గ్రామజ్యోతిని పొగుడుతూ కార్టున్ వేసింది ఈనాడు పత్రిక.. అదే ఏపీ ఎడిషన్ లో కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని నిరసిస్తూ మరో కార్టున్ ను వేసింది.. ఆ రెండు కార్టున్ లు మీరూ చూడండి.. ఈనాడు తెలివి ఏంటో అర్థం అవుతోంది. ఎంతైనా బతక నేర్చిన పెద్దాయన కదా..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *