రెండు పత్రికల యుద్ధం

ఒకటి తెలంగాణ కోసం పుట్టిన పత్రిక.. ఇంకోటేమో తెలంగాణలో పుట్టి ప్రస్తుతం ఆంధ్రాకు సపోర్ట్ గా నడుస్తున్న పత్రిక.. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తమ తమ వాణిలను వినిపించిన ఆ రెండుపత్రికలు.. ఇప్పుడు సై అంటే సై అంటున్నాయి.. అవే నమస్తే తెలంగాణ.. ఆంధ్రజ్యోతి..

గవర్నర్ పై ఆంధ్రజ్యోతి అటాక్…
ఆంధ్రజ్యోతి దినపత్రిక.. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ గవర్నర్ పై వివాదాస్పద రీతిలో రాయడం వివాదానికి కారణమైంది. ‘గవర్నర్ గారి టీపార్టీ’.. అంటూ.. నిన్న ఏకంగా గవర్నర్ తెలంగాణకు మేలు చేస్తూ ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నాడంటూ రాధాకృష్ణ ఎడిటోరియల్ రాయడం వివాదానికి దారితీసింది.

రాధాకృష్ణపై నమస్తే ఫైట్..
ఇక తెలంగాణపై విషం కక్కుతున్నాడంటూ నమస్తే తెలంగాణ పత్రిక నిన్నటి నుంచి రాధాకృష్ణ బండారం బయటపెడతామంటూ మొదటి పేజిలో ఆయన తీరును ఎండగట్టింది. ఈరోజు నుంచి ఆయనపై వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఈరోజు ప్రచురించిన ‘తెలంగాణపై కుట్రల తోవ-ఆంధ్రాకు ఏరువాక’ ఐటంలో రాధాకృష్ణపై దుమ్మెత్తి పోసింది.

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ
మొత్తానికి తెలంగాణ, ఆంధ్రా నేపథ్యమున్న ఈ రెండు పత్రికల వైరం.. రెండు ప్రభుత్వాలు నడిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు చంద్రబాబు ప్రోత్సాహంతో రాధాకృష్ణ గవర్నర్ ను ఇరుకున పెట్టి ఆంధ్రాకు మేలు చేయాలని సంకల్పిస్తుండగా… గవర్నర్ కు, తెలంగాణకు అండగా నమస్తే తెలంగాణ దినపత్రిక రాధాకృష్ణ, చంద్రబాబు బాగోతాన్ని బయటపెడుతోంది. ఈ రెండు పత్రికలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతుంది. ఎవరి వాదన వారికి కరెక్టే.. కానీ దాన్ని రాజకీయం చేస్తున్న పత్రికల తీరును అందరూ గమనిస్తున్నారు. ఏదీ నిజం అని పాఠకులే తేల్చాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *