రెండు పడక గదుల ఇండ్ల పధక ప్రక్రియ వేగవంతం చేయాలి

కరీంనగర్: జిల్లాలో చేపట్టాల్సిన రెండు పడక గదుల ఇండ్ల పధక ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో రెండు పడక గదుల ఇండ్ల పధకంపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గ్రామీణ ప్రాంతాల్లో 4567, పట్టణ ప్రాంతాల్లో 2380 మొత్తం 6947 రెండు పడక గదుల ఇండ్లు మంజూరుకాగా, పరిపాలనా అనుమతులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 93435 ధరఖాస్తులు రాగా, ఇప్పటికి గ్రామీణ ప్రాంతంలో 3310, పట్టణ ప్రాంతంలో 240 మంది లబ్దిదారులను ఎంపికచేసినట్లు, 169 స్ధలాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. స్దలాలవారిగా టెండర్లను పిలవాలని, త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. గుర్తించిన స్దలాల లే అవుట్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలున్నచో వెంట వెంటనే పరిష్కరించుకోవాలని, ఉద్యోగుల అవశ్యకత వున్నచో అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించుటకు అనుమతిస్తామని అన్నారు. రెండు పడక గదుల పధకాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరధ కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరధ కార్యక్రమం జిల్లాలో మందకొడిగా సాగుతుందని, పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో హౌజింగ్ పిడి నర్సింహ రావు, ఆర్ అండ్ బి ఎస్ఇ పింగళి సతీష్, మిషన్ భగీరధ ఎస్ఇ శ్రీనివాస రావు, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *