రెండు జిల్లాల వారు కొట్టుకున్నారు..

medak

మెదక్-కరీంనగర్ సరిహద్దు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్ల కు చెందిన బీడీల కంపెనీ టేకేదారు శ్రీరాం శ్రీహరి మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ వాసుల దాడిలో మృతిచెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. ఇబ్రహీంపూర్ సర్పంచి కుమారులు దాడి చేయడం వల్లే శ్రీహరి మృతిచెందాడని ఆరోపిస్తూ శ్రీహరి బంధువులు జిల్లెల్ల, తెర్లుమద్ది, వీర్నపల్లి గ్రామస్థులు పెద్దఎత్తున ఆగ్రామానికి వెళ్లి ఆందోళనకు దిగారు. సర్పంచి ఇంటికి నిప్పటించారు. సర్పంచి భార్యను వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. ఐజీ నవీన్ చంద్, మెదక్, కరీంనగర్ ఎస్పీలు సుమతి, జోయల్ డేవిస్ లు ఇబ్రహీంపూర్ కు చేరుకొని గ్రామస్థుల ఫైటింగ్ ను అదుపులోకి తెచ్చారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై కూడా కిరోసిన్ పోసి నిప్పంటిచేందుకు ప్రయత్నించగా పోలీసులు పారిపోయారు. రాళ్ల , మట్టికుప్పల దాడులు జరిగి రణరంగంగా మారింది. ఒక వ్యక్తి మరణం రెండు జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *