
తెలంగాణ వ్యాప్తంగా రూ.20కే కిలో ఉల్లి విక్రయ కేంద్రాలు వెలిశాయి.. హైదరాబాద్ లో 40కి పైగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకు అన్ని పట్టణాలు,నగరాల్లో ఈ కిలో రూ.20 విక్రయ కేంద్రాలను తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రారంభించారు.
కరీంనగర్ రైతు బజార్ లో సబ్సిడీ ధరపై 20/- రూపాయలకు 1కిలో ఉల్లిగడ్డల విక్రయ కేంద్రాన్ని తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి వర్యులు శ్రీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, ఈద శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.