
ఏఎన్, ఢిల్లీ : దేశంలో అత్యధిక కార్లను అమ్మే మారుతి సుజుకి.. తన చవక కారు ఆల్టో 800ను మెరుగులు దిద్ది కొత్త హ్యాచ్ బ్యాక్ మోడల్ ను ఢిల్లీలో రిలీజ్ చేసింది. దీన్ని కేవలం 2.49 లక్షలకే అమ్మేందుకు నిర్ణయించింది. ఆల్టో 800 హ్యాచ్ బ్యాక్ కారు సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే 6 రంగులతో మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి రిలీజ్ చేసింది మారుతి ..
ఈ కొత్త అప్ గ్రేడెడ్ వెర్షన్ లో ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షించింది.. దీంతో పాటుగా వెలుపలి భాగాన్ని ఆకర్షణీయంగా రూపొందించి, కేబిన్ లో మరింత స్థలాన్ని కల్పించి ఆకర్షించింది. పెట్రోల్ , సీఎన్జీ వెర్షన్ లలో మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మైలీజీ కూడా 10శాతం పెంచినట్టు కంపెనీ తెలిపింది..