Breaking News

రూ.1,850లకే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఫోన్!

nokia-1850 phone relese microsoft

ముంబై, ప్రతినిధి : నోకియా కంపెనీని ఓన్ చేసుకున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ లో తన బ్రాండ్ వాల్యూ పెంచుకోనే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. దీని కోసం లేటెస్ట్ గా ఓ ఫోన్ ను రిలీజ్ చేసింది. ‘నోకియా 215’  మోడల్ తో కంపెనీలోనే ‘చీపెస్ట్ ఫోన్’ ను కస్టమర్ల ముందుంచింది. తక్కువ కాస్ట్ లోనే కస్టమర్లకు ఇంటర్నెట్ వాడుకోనే అవకాశం కల్పించింది.  ఇందులో రెండు మోడల్స్ ను మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది.

ఈ మొబైల్ ను రూ.1,850లకే అందిస్తుంది. 2.4 ఇంచ్ డిస్ప్లేతో ఉండే ఈ ఫోన్ 32జీబీ వరకూ మెమొరీ కార్డ్ ను సపోర్ట్ చేస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, మెసెంజర్ లతో పాటు ఓపెరా మినీ బ్రౌజర్ ను కూడా మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. బ్లాక్, గ్రీన్, వైట్ కలర్ తో మోడల్స్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. ఈ మొబైల్స్ ను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా, యూరప్ దేశాల్లో అందుబాటులో ఉంచింది మైక్రోసాఫ్ట్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *