రూ.1కే గణేష్ లక్కీ డ్రాలు.. భారీ బహుమతులు

కరీంనగర్ : కరీంనగరంలో ఇప్పుడు గణేష్ లక్కీ డ్రాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.. కరీంనగరంలోని ప్రధాన టవర్ సర్కిల్ లో గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం భారీ గణపతి ప్రతిష్టిస్తారు. దాంతో పాటు భక్తుల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తారు.. ఈ డ్రాలో ఈసారి టీవీఎస్ జ్యూపిటర్ మొదటి బహుమతిగా పెట్టారు. రెండో బహుమతి ఎల్ సీడీ టీవీ..,  రిఫ్రిజిరేటర్ 3 వ బహుమతిగా.. మరియు మరికొన్ని కన్సోలేషన్ బహుమతులను పెట్టారు. కాగా ఈ లక్కీడ్రా చిట్టీల రుసుం కేవలం రూ.1 మాత్రమే.. ప్రధాన నగరంలోని సెంటర్ టవర్ సర్కిల్ లో ఉండడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నగరంలోని భక్తులు విరగబడి చిట్టీలు కొంటున్నారు. రూ.1కే ఒక చిట్టి కావడంతో ఒక్కొక్కరు కనీసం పది నుంచి 100 వరకు కొని తమ పేరు ఫోన్ నంబర్లు, అడ్రస్ నింపి డబ్బాలో వేస్తున్నారు.. కాగా ఇప్పటికే 10,000 వేలకు పైగా చిట్టీలు అమ్ముడుపోయాయట.. స్పాన్సర్స్ గా ఆదర్శ టీవీఎస్, హాస్పిటర్, కరీంనగర్ వర్తక సంఘాలు ఉంటున్నాయి.. కాగా చిట్టీలు అమ్మిన డబ్బే బహుమతులకు సరిపోయేంత వస్తోందట.. వేల చిట్టీలు అమ్ముడు పోతున్నాయి..

Photo1470

కోతిరాంపూర్ లో కూడా లక్కీ డ్రా..

కాగా టవర్ సర్కిల్ తో పాటు కోతిరాంపూర్ వద్ద కూడా ఈసారి లక్కీ డ్రా ప్రవేశపెట్టారు. ఇక్కడ ఆదర్శ టీవీఎస్ సౌజన్యంతో టీవీఎస్ జూపిటర్ ను ప్రథమ బహుమతిగా పెట్టారు. ద్వితీయ బహుమతి ఎల్ ఈ డీ టీవీ, 3 వ బహుమతి ఫ్రిజ్ ను పెట్టారు. రుసుం మాత్రం ఒక్కో టికెట్ ధర 20 రూపాయలు.. ఇక్కడ కూడా ఇప్పటికే 10000 వేల టికెట్లకు పైగా అమ్ముడు పోయాయి..  దీంతో 2 లక్షలు ఇప్పటికే వచ్చేశాయట.. గణేష్ మండల నిర్వాహకులు పెట్టిన బహుమతుల విలువ లక్ష కాగా వారికి ఇప్పటికే 2 లక్షల రూపాయలు జమయ్యాయి.. ఒక లక్ష ఎక్కువగానే వారికి వచ్చింది.. దీంతో భక్తులకు బహుమతులు, నిర్వాహకులకు లాభాలు తెచ్చిపెడుతోంది..

మొత్తానికి గణేష్ పండుగ నిమజ్జనం రోజున ఈ లక్కీ డ్రాలు తెరుస్తారు. విజేతలెవరైనా రూ.1, రూ.20 పెట్టి కొన్న ఒక్క వ్యక్తికే టీవీఎస్ జూపిటర్, టీవీ, ఫ్రిజ్ గెలుస్తారు.. ఆ ఒక్కరు ఎవరైనా నిర్వాహకులకు మాత్రం టికెట్ల తోనే దాదాపు 2 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఒక లక్ష బహుమతులు పోయినా.. మరో లక్ష దేవుడి పేర మిగులుతుంది. భక్తులు కూడా దేవుడి పేరుమీద చిట్టీలు కొంటున్నారు. గెలువకపోయినా గణేషుడికి చందా రాసినట్టు ఫీలవుతున్నారు. ఎంతైనా ఈ దేశంలో భక్తికి భక్తి.. బహుమతులకు బహుమతులు ..

జై బోలో గణేష్ మహరాజ్ కీ జై..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.