
భారీ తారగణంతో కాకతీయ సామ్రాజ్యాపు చరిత్రను తెరకెక్కించిన గుణశేఖర్ సినిమా రుద్రమదేవి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలో కృష్ణం రాజు గణపతి దేవుడిగా.. మహా మంత్రిగా ప్రకాశ్ రాజ్, నిడదవోలు రాజుగా రానా, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ చూపిన నటనగా అద్భుతంగా ఉందంటున్నారు.
సినిమాలో అల్లు అర్జున్ రుద్రమదేవి(అనుష్క) రాజు కావడంతో తిరుగుబాటు చేస్తాడట.. ఈ ఎపిసోడ్ 50 నిమిషాల పాటు ఆద్యంతం ఆసక్తి గొలిపిందని సమాచారం. మొత్తం సినిమా చూసిన ప్రేక్షకులందరూ బాగుందంటూ సినిమా హిట్ చేశారు.