
శనివారం విశాఖపట్నంలో రుద్రమదేవి ఆడియోను లాంచ్ చేసిన రుద్రమదేవి యూనిట్ బృందం.. ఆదివారం తెలంగాణలోని వరంగల్ లో మూవీ ఆడియోను రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ , కొండా సురేఖ, మురళి , వరంగల్ జిల్లా నేతలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ కాకతీయుల కళావైభవాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేసిన గుణశేఖర్, అనుష్క, రానా , అల్లు అర్జున్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
కొండా సురేఖ మాట్లాడుతూ అరుంధతి నుంచి రుద్రమదేవి వరకూ అనుష్క ఎంతో కష్టపడి పాత్రలు పోషించిందని.. ఆమె ధైర్యాన్ని, పనితనాన్ని మెచ్చుకున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడ్డ గుణశేఖర్ కృషి ని గుర్తించి అందరూ సినిమాను విజయవంతం చేయాలని కోరారు.
హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ యాసతో మాట్లాడి అలరించారు. ఈ సినిమాకు హీరో అనుష్కనే ఆమె కాబట్టి ఈ సినిమా తీయగలిగారు. వేరొకరెవరైనా ఈ సినిమా ఇంతలా వచ్చేది కాదు..ఈ సినిమా చేసిన అనుష్కకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో నేను ఒక భాగం కావడం అదృష్టమన్నారు. ఈ సినిమాలో ఎందుకు చేస్తున్నావని అడిగితే .. నాకు సినిమా అంటే ప్రాణం అని చెప్పా. చిరంజీవిగారి నీడలో మేం పైకొచ్చాం. ఆయన తర్వాతే నాకు ఎవరైనా.. తెలుగు సినిమా ఓ మెట్టు ఎక్కడానికే ఈ సినిమాలో చేశా.. నన్నారు.
అనంతరం తొలిసీడీ ని బన్నీ అల్లు అర్జున్ రిలీజ్ చేసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అందజేశారు.