
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ మాఫీలో లొసుగులు బయపడుతున్నాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీకి రుణ మాఫీ పథకం వర్తించింది. ఇందులో భాగంగా 12,180 రూపాయలు ఆమె ఎకౌంట్లోకి జమయ్యాయి. విజయ నగరం జిల్లాలోని బలిజపేట మండలం నారాయణపురం గ్రామంలో ఆమె వరి పంట పండించారని అధికారిక రికార్డుల్లో ఉంది. కానీ బొత్స కుటుంబం ఏ పంటా పండించ లేదని ఓ పత్రిక వెల్లడించింది.
దీంతో రుణ మాఫీ ఎంత మేలు చేస్తుందనేది అనుమానాస్పదంగా మారింది. బొత్స కుటుంబం నిజంగా పంటలు పండించి, ఆరుగాలం కష్టపడ్డ కుటుంబమా కాదా అనేది తేలాల్సి ఉంది. నిజంగా పంటనే పండిస్తే రుణ మాఫీకి అర్హులు అవుతారు. అదే గ్రామంలో చాలా మంది తుఫాను బాధితులకు తగిన పరిక్షహారం రాలేదని గ్రామస్తులు చెప్తున్నారు. సరైన లెక్కలు తీసుకోక పోవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోవాల్సి వస్తోందని వారంటున్నారు.
ఆంగ్ల పత్రిక వెల్లడించిన ప్రకారం రైతులు కాని బొత్స కుటుంబం రుణమాఫీ ద్వారా లబ్ధి పొందితే దీనిపై ఏ చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. పంట వేశారా లేదా అనేది నిర్దారణ కావాల్సిన అవసరం ఉంది.