
హైదరాబాద్ , ప్రతినిధి : ఏపి అసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై చర్చ జగుతున్న సందర్భంగా ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇరు పక్షాలు వాదోపవాదాలు చేసుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఏపిలో మొత్తం 87 వేల కోట్ల రుణాలున్నాయని సంబంధిత మంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ప్రతిపక్షాలు విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రుణాలు మాఫీ కాలేదు.. కొత్త రుణాలు రాలేదన్నారు. వ్యవసాయరంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు.
విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు 34, 44 వేల హెక్టార్లలో పంటలు వేశారని తెలిపారు. విత్తనం వేసేటప్పుడు ఏ రైతు కరవు వస్తుందని అనుకోడని చెప్పారు. రుణమాఫీలో వడ్డీ, అసలు ఎంత చెల్లిస్తున్నారో స్పష్టత లేదని పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి ఓ రౌడీ అని విమర్శించారు. సభలో రౌడీయిజం చెలాయించాలని చూస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.