రిలయన్స్ బంకుల రీ ఓపెన్

న్యూఢిల్లీ : ఓ వైపు రిలయన్స్ గ్యాస్, చమురు నిక్షేపాలు సంవృద్దిగా ఉండడం.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతుండడంతో మళ్లీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన రిలయన్స్ బంకులను పున: ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మొత్తం 1400 పెట్రోల్ పంపులు 320 రిటైల్ అవుట్ లెట్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. భారీ రవాణా వాహనాల కోసం నగదు అవసరం లేకుండా స్మార్ట్ కార్డులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.

దేశంలో పెట్రోల్ , డీజిల్ పై నియంత్రణ ఎత్తివేయడంతో అంతర్జాతీయ ధరలకనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకోవచ్చు. దీనివల్ల లాభం వస్తుంది. అందుకే రిలయన్స్ మళ్లీ పెట్రో రంగంలోకి అడుగుపెడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *