Breaking News

రిటైర్ మెంట్ ప్రకటించిన పవన్

Pawan Kalyan

సినిమాల నుంచి తన రిటైర్మెంట్ పై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ పై డివైడ్ టాక్ రావడంతో దాన్ని ప్రమోషన్ లో భాగంగా తెలుగు న్యూస్ చానల్స్ తో పవన్ మాట్లాడారు.. ఈ సందర్భంగా తనకు సినిమాలంటే ఇష్టం లేదని చెప్పాడు. ఏదో డబ్బుకోసం, బతకడానికి చేస్తున్నానని చెప్పాడు. కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. వాటిని 2019లోపే పూర్తి చేస్తానని చెప్పాడు. దాసరి నారాయణ రావుతో కూడా ఒక సినిమా ఉందని చెప్పాడు. కానీ వీటన్నింటిని 2019లోపు పూర్తి చేసి ఇక సినిమాలకు గుడ్ బై చెప్తానని మీడియాతో పవన్ అన్నాడు. ప్రత్యక్షంగా సినిమాల్లో ఉండడని సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటిస్తాననని చెప్పాడు.

2019 ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు. అప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉండి జనసేన తరఫున ప్రజలకు సేవ చేస్తానని చెప్పాడు. దీంతో ఇక పవన్ హీరోగా కాకుండా రాజకీయాల ద్వారా మనకు కనిపిస్తాడన్న మాట.. ఈ ప్రకటనతో పవన్ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. తమ అభిమాన హీరో సినిమాలకు దూరమవడంపై అందరూ ఫ్యాన్స్ హర్టవుతున్నారు.

పవన్ కళ్యాణ్ పూర్తి ఇంటర్వ్యూ పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *