రిటైర్డ్ పోలీసులు ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వామలు కావాలి

రిటైర్డ్ పోలీసులు ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. పెన్షనర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ధియేటర్ ఆవరణలో కరీంనగర్ జిల్లా రిటైర్డ్ పోలీసు ఉద్యోగుల అసోసియేషన్ పదవి విరమణ పొంది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పోలీసులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి విచ్చేసి రిటైర్డ్ పోలీసు ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేసిన శాశ్వత శాంతికమిటిలో చురుకుగా ఉన్న రిటైర్డ్ పోలీసులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఆరోగ్య భద్రత తరహలో రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ స్కీం అమలు కోసం భద్రత అధికారుల దృష్టికి తీసుకువెళుతానని చెప్పారు. ఈ మేరకు తనకు ఒక వినతి పత్రం అందజేయాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరాలకు తమను ఆహ్వానించాలని కోరారు. శారీరకంగా సంసిద్దంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు గౌరవభృతి అందించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యాలయ నిర్వహణ కోసం విశాలమైన గదులను కేటాయించాలని తెలిపారు. రిటైర్డ్ పోలీసు ఉద్యోగులు రాజేశం, ఓ మల్లయ్య, పుల్లయ్య కాంబ్లి, పి. నంబయ్య, సురేష్ బాబు, యూసుఫ్ మీర్జా, ఇస్మాయిల్, కె. మధుసూధన్, కె, మొగిలయ్య, కె.రాజయ్య, విశ్వనాధం, పి.ఆగయ్య, బసవయ్య, ఎక్బాల్, ఎన్. జనార్ధన్, ఎస్.నారాయణలను కమీషనర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు టి.సత్తయ్య, అధ్యక్ష, కార్యదర్శులు సురేష్ బాబు, బాసిత్,  ప్రతినిధులు అహద్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

v-b-kamalasan-reddy

ముగ్గురు టీజర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన కమీషనర్:
కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో మహిళలు విద్యార్ధినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేస్తున్న ముగ్గురు టీజర్లను షీటీం సభ్యులు పట్టుకున్నారు. టీజర్లు వీణవంక మండలం శ్రీరాముల పేటకు చెందిన దుదురి ఆంజనేయులు, మానకొండూరు మండలం కొండపల్కలకు చెందిన దాసరి నరేష్, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన గోపిశెట్టి రవీందర్ లకు పోలీస్ కమీషనర్ వి.బి కమలాసన్ రెడ్డి శనివారం నాడు తన కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలకు పాల్పడినట్లయితే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. అల్లరిమూకల ఆగడాల నియంత్రణకు ముఖ్యకూడళ్ళలో మఫ్టీలో పోలీసు బృందాలతో గస్తీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. షీటీం సభ్యులు ప్రతి అనుమానిత ప్రాంతాల్లో సంచరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, సాక్ష్యాధారాలతో టీజర్లను పట్టుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అల్లరి మూకల ఆగడాలకు సంబంధించి మహిళలు, విద్యార్ధినులు డయల్ 100, షీటీం ఇంఛార్జి ఇన్స్ పెక్టర్ 9440900986లకు ఫోన్ ద్వారా లేదా 9440795182 నెంబర్ నకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన తెలియజేశారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.