‘రిక్వెస్ట్‌’ మూవీ ప్రారంభం 

శ్రీ నేత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత మరియు దర్శకురాలైన సుజాత రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘రిక్వెస్ట్‌’. ‘జస్ట్‌ లైక్‌ వార్న్‌’ అనేది ఉపశీర్షిక. హైద్రాబాద్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయం నందు జరిగిన పూజా కార్యక్రమాలలో ప్రముఖ దర్శకుడు వెంకీ, ప్రముఖ నిర్మాత అపురూప్‌ (శివ)లు స్క్రిఫ్ట్‌ని నిర్మాత మరియు దర్శకురాలైన సుజాత రెడ్డికి అందించారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత సుజాతరెడ్డి మాట్లాడుతూ..’శ్రీ నేత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘రిక్వెస్ట్‌’ అనే చిత్రాన్ని నేనే స్వయంగా నిర్మిస్తూ..దర్శకత్వం చేస్తున్నాను. ‘జస్ట్‌ లైక్‌ వార్న్‌’ అనేది ఉపశీర్షిక. ప్రశాంత్‌, శ్రీవల్లి, ఆలీషా, దివ్య, రమణారెడ్డి, శ్యామ్‌, సూరి, ప్రణీత్‌రెడ్డి మొదలగు వారు ఇందులో ప్రముఖ నటీనటులు. పెద్దమ్మ తల్లి దైవ సన్నిధానం నందు ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ తల్లి ఆశీస్సులతో పాటు, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వెంకీ గారికి, అపురూప్‌ గారికి ధన్యవాదములు. ఈ మూవీ యూత్‌ని టార్గెట్‌ చేస్తూ తెరకెక్కనుంది. ‘రిక్వెస్ట్‌’ అనే టైటిల్‌లోనే చాలా మర్యాద ఉంది. ఈ రోజుల్లో యూత్‌ ఏం కోల్పోతున్నారో..అనే అంశాన్ని ఇందులో చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి..’ అని తెలిపారు.
వెంకీ, అపురూప్‌లతో పాటు ఇంకా ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌, హరీష్‌లు పాల్గొన్నారు.
requst
ప్రశాంత్‌, శ్రీవల్లి, ఆలీషా, దివ్య, రమణారెడ్డి, శ్యామ్‌, సూరి, ప్రణీత్‌రెడ్డి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి స్టిల్స్‌: శ్రీధర్‌, సంగీతం: మల్లిక్‌ ఎన్‌వికె, ఆర్ట్‌: రాఘవ, ఎడిటింగ్‌: ఎస్‌.ఎస్‌. వీడియోస్‌, నిర్వహణ: గండికోట కళ్యాణ్,  కెమెరామ్యాన్‌: ఎన్‌ఆర్‌ మేకల, నిర్మాత మరియు దర్శకురాలు: సుజాత రెడ్డి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *