రాహుల్ లో ఇంత మార్పా.?

-షాక్ అవుతున్న కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు

-ఆనంద బాష్పాలు రాల్చిన సోనియా

న్యూఢిల్లీ : రాహుల్ లో ఓ కొత్త మార్పు కనిపిస్తోంది. 2 నెలల సెలవు కాలంలో ఆయన విదేశాలకు వెళ్లి ఏం చేశారోనని ఇన్నాళ్లు ఆరా తీశాం. కానీ ఏమైందో ఏమో కానీ.. సెలవు తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం ఓ కొత్త రాహుల్ ను చూస్తోంది. దేశ ప్రజలు, మీడియా కూడా రాహుల్ వైఖరిలో స్పష్టమైన మార్పును గమనిస్తోంది..

రాహుల్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన నాడే రైతు ర్యాలీ లో పాల్గొని ప్రసంగంతో అదరగొట్టారు. ఆ తర్వాత పార్లమెంటులో జరిగిన చర్చల్లో పాల్గొంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని విస్తుపోయేలా చేస్తున్నారు. ఆయన ప్రధానిని, బీజేపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంచి స్పందన వచ్చింది. పదునైన మాటలు, చూపులు, స్పష్టమైన నికార్సైన డైలాగులతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. రాహుల్ మాట్లాడుతుంటే వెనుకనున్న ఎంపీలు, కాంగ్రెస్ అధినేతి సోనియా ముసిముసి నవ్వులతో తమ హర్షం ప్రకటించారు.

కాగా రెండు నెలల కాలంలో రాహుల్ ఏం తీసుకున్నాడో .. ఏం చేశాడో తెలియదు కాదు కానీ.. ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఒక పరిపూర్ణ మనిషి, పరిణతి చెందిన వ్యక్తిలా రాహుల్ తయారయ్యాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *