
ఆదిలాబాద్ : రాహుల్ గాంధీ ఆదిలాబాద్ పాదయాత్ర సభలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం ఏర్పాటు చేసిన కళాకారులు, కార్యకర్తలు రాహుల్ పాదయాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆద్యంతం వెరైటీ వేషధారణ, డప్పు చప్పుళ్లు, రాహుల్ ఫ్లెక్సీలు, కళారూపాలతో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
విభిన్నంగా ఏర్పాటు చేసిన కరపత్రాలు, రాహుల్ ఫ్లెక్సీలతో పాటు కటకం మృత్యుంజయం ప్రత్యేకంగా రాహుల్ పాదయాత్ర కోసం వేసిన వారపత్రిక అందరి మదిని దోచేసింది. అందరూ ఈ పత్రికను చదివి రాహుల్ విశేషాలను తెలుసుకున్నారు. అలాగే కరీంనగర్ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం రాహుల్ పాదయాత్రను దిగ్విజయం చేసింది.