
ఆదిలాబాద్ : రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న 15 కి.మీ ల పాదయాత్రలో ఆయన కుడి, ఎడమకు తెలంగాణ పీసీసీ సారథులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఉన్నారు. యువనేతకు తెలంగాణ పీసీసీ సారథులు వెన్నంటి ఉండి ఆయనతో 15 కి.మీలు వెంట నడిచారు. మిగతా వీహెచ్. జైపాల్, జానా లాంటి సీనియర్ నేతలు వయోభారంగా వడ్యాల్ బహిరంగ సభ వేదికపైనే ఉండగా ఉత్తమ్, భట్టిలు వెన్నంటి పాదయాత్రలో పాల్గొనడం విశేషం.