రాష్ర్ట సైన్స్ అండ్ టెక్నాల‌జీ కౌన్సిల్ స‌మీక్ష‌లో మంత్రి జోగు రామ‌న్న‌

రాష్ర్ట సైన్స్ అండ్ టెక్నాల‌జీ కౌన్సిల్ స‌మీక్ష‌లో మంత్రి జోగు రామ‌న్న‌

త‌క్కువ ఖ‌ర్చుతో ప్రాణాంత‌క వ్యాధుల‌కు చికిత్స‌

ప‌రిశోధ‌న‌ల‌కు 10 ప్రాజెక్టుల‌కు బాధ్య‌త‌లు

వివిధ ప‌రిశోధ‌న‌ల కోసం రూ. 50 ల‌క్ష‌ల మంజూరు

హైద‌రాబాద్‌: త‌క్కువ ఖ‌ర్చుతో ప్రాణాంత‌క వ్యాధుల‌కు చికిత్స అందించేందుకు వివిధ ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, అందుకు 10 ప్రాజెక్టుల‌కు ప‌రిశోధ‌న‌ల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న తెలిపారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో జ‌రిగిన రాష్ర్ట సైన్స్ అండ్ టెక్నాల‌జీ కౌన్సిల్ మ‌ధ్యంత‌ర స‌మీక్షా స‌మావేశంలో మంత్రి జోగు రామ‌న్న సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప్ర‌స్తుతం అత్యంత ఖ‌రీదుగా మారిన వైద్య ప‌రీక్ష‌ల‌ను ప్ర‌జ‌ల‌కు చౌక‌గా అందించేందుకు సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ త‌ర‌ఫున కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క్యాన్స‌ర్‌, కిడ్నీ, మైగ్రెన్‌, బీ-త‌ల‌సేమియా వంటి ప్రాణాంత‌క వ్యాధుల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో వైద్యం ప్ర‌జ‌ల‌కు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. వివిధ వ్యాధుల ప‌రిశోధ‌న‌ల బాధ్య‌త‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ల‌కు అప్ప‌గించామ‌న్నారు. వివిధ సంస్థ‌లకు చెందిన 10 ప్రాజెక్టుల‌కు ప‌రిశోధ‌న‌ల కోసం బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించామ‌ని అన్నారు. ప‌రిశోధ‌న‌ల కోసం రూ.50 ల‌క్ష‌లు మంజూరు చేశామ‌న్నారు. తొలి విడ‌త‌గా రూ.25 ల‌క్ష‌లు విడుద‌ల చేశామ‌న్నారు. స్థానిక ప‌రిశోధ‌న‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వాన నీటిని భూగ‌ర్భ జ‌లాల్లోకి డైరెక్ట్‌గా క‌ల‌ప‌డం ద్వారా న‌ల్ల‌గొండ జిల్లాలో ఫ్లోరిన్ శాతాన్ని క్ర‌మంగా త‌క్కువ‌గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు శాస్ర్త వేత్త‌లు స‌మావేశంలో తెలిపారు. జేఎన్‌టీయూ ఆధ్వ‌ర్యంలో న‌ల్ల‌గొండ జిల్లా మ‌ర్రిగూడ మండ‌ల పాఠ‌శాల‌లో దీన్ని ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసిన విష‌యాన్ని శాస్ర్త‌వేత్త‌లు తెలిపారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల‌లో రేడియేష‌న్ గుర్తించ‌డం ప్రాజెక్ట్ మ‌రో ల‌క్ష్య‌మ‌ని మంత్రి జోగు రామ‌న్న పేర్కొన్నారు. జీఐఎస్ ద్వారా రోడ్డు ప్ర‌మాదాల‌ను క్రోడీక‌రించి ఈ మెసోర్మెంట్ బుక్‌ను త‌యారు చేయ‌డం కూడా ప్రాజెక్టులో ల‌క్ష్య‌మ‌న్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెలాఖ‌రులో గుజ‌రాత్ రాష్ర్టం అహ్మ‌దాబాద్‌లోని సైన్స్ సిటీలో జ‌రిగిన జాతీయ స్థాయి కార్య‌క్ర‌మంలో తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు బాల శాస్ర్త‌వేత్త‌లు అరీబా అయ్యెన్‌, మ‌హేంద‌ర్‌రెడ్డిలు అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి జాతీయ బృందానికి ఎంపిక‌య్యార‌ని, అందుకు ఆ ఇద్ద‌రు బాల‌ల‌ను అభినందిస్తున్న‌ట్లు మంత్రి జోగు రామ‌న్న తెలిపారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో అట‌వీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్‌, మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ జీ. కృష్ణ‌వేణీ, ప‌లువురు శాస్ర్త‌వేత్త‌లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *