Breaking News

రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి కెటి రామారావు సమావేశం

రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి కెటి రామారావు సమావేశం

రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. ఖైరతాబాద్ లోని ఇన్టిట్యూషన్ అప్ ఇంజనీర్స్ కార్యాయలంలో జరిగిన ఈ సమావేశంలో జియచ్యంసి, డిటిసిపి అధికారులు, రాష్ర్ట వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు హజరయ్యారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వతా ప్రజలు ప్రభుత్వం నుంచి సరికొత్త పాలన అశించారని, ఆ దిశగా అనేక పాలనా సంస్కరణలతో ముందుకు పొతున్నామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. అందులో భాగంగానే స్టేట్ యూనిఫైడ్ రూల్స్ ని తీసుకుని వచ్చామన్నారు. సాదారణ పౌరునికి అత్యంత పారదర్శకంగా, ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు వచ్చేలా డిపియంస్ విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చామని మంత్రి తెలి పారు. ఈ విధానంలో నెల రోజుల గడువును కుదించి 21 రోజుల్లోని అన్ని అనుమతులు వచ్చేలా చేశామన్నారు. అప్లైయ్ చేసుకున్న వారం రోజుల్లో దరఖాస్తులో ఉన్న లోపించిన పత్రాల తాలుకు సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. అనుమతుల ప్రక్రియలో ఉన్న అనవసర ఆలస్యాన్ని తగ్గించేందుకే ఈ విధానం తీసుకుని వచ్చామని తెలిపారు. డిపియంయస్ విధానం పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి అవగాహణ పెంచుకోవాలని, సంపూర్ణ పరిజ్జానంతో పనిచేయాలని మంత్రి అధికారులను కోరారు. ప్రజల్లో అధికార వ్యవస్దకు మరింత పేరు తేచ్చేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలన్నారు.

kt rama rao 1

ప్రభుత్వం తేచ్చిన అన్ లైన్ విధానం పట్ల మంత్రి అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారిస్తుందన్న మంత్రి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 21 రోజుల గడువు లోపల అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేసే అధికారులపైన టియస్ ఐపాస్ లో మాదిరి ఫెనాల్టీలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం అవుతామని మంత్రి తెలిపారు. క్రమబద్దమైన పురపాలనలో టౌన్, కంట్రీ ప్లానింగ్ అధికారుల పాత్ర కీలకమైనదన్న మంత్రి, అధికారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ముఖ్యంగా నూతనంగా ఎర్పాటైన జిల్లా కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమ కట్టడాలను అరికట్టడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీంతోపాటు అన్ని పురపాలికల్లోని లేఅవుట్లలోని ఖాళీ ప్రదేశాలు( ఓపెన్ ప్లాట్లు) ను కాపాడడంలో మున్సిపల్ కమీషనర్లతో కలిసి పనిచేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్ధానికంగా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులతోపాటు రాష్ట్ర స్ధాయిలో తీసుకోవాల్సిన చర్యలపైన వివరాలు అందించాలని సిడియంఏ శ్రీదేవి, డిటిసిపి డైరెక్టర్లను అదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న ఏల్ అర్ యస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తమ విధుల్లో టెక్నాలజీ సహాకారంతో విధులు నిర్వర్తించేందుకు అవసరం అయిన సూచనలివ్వాలనన్నారు. ఈ సమావేశంలో జియచ్ యంసి, హెచ్ యండిఏ కమీషనర్లు, సిడియంఏ, డిటిసిపి మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

kt ramarao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *