రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు-చైతన్య స్పూర్తి అవార్డులు-ఎంట్రీలకు ఆహ్వానం


తెలంగాణ లోని ఉత్సాహవంతులయిన యువ చలనచిత్రకారులను ప్రోత్సహించేందుకు గాను
కాంపస్ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లఘు చిత్ర పోటీల్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ జన జీవితానికి, కళా సంస్కృతులకు చెందిన ఏదయినా అంశాన్ని తీసుకుని పది (10) నిముషాలకు మించకుండా నిర్మించిన లఘు చిత్రాలను ఈ పోటీలకు స్వీకరిస్తారు. ఉత్తమ మయిన వాటిని ప్రముఖులయిన న్యాయ నిర్ణేతల చేత ఎంపిక చేసి ‘చైతన్య స్ఫూర్తి అవార్డుల్ని’ అందజేస్తారు. అవార్డు కింద మేమేంటో సైటేషన్ తో పాటు, మొదటి బహుమతి గా పది వేల రూపాయలు, ద్వితీయ అవార్డుకి అయిదు వేలు, మూడవ బహుమతిగా మూడువేలు అందజేస్తారు. డిగ్రీ,ఇంజనీరింగ్,మెడికల్ విద్యార్థులతో పాటు తెలంగాణకు చెందిన వారెవరియినా ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. ఆసక్తి గల వారు తమ చిత్రాల్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింకును filmcontest@scce.ac.in ఈమెయిల్ కి పంపించవచ్చు. లేదా ఫిల్మ్ డి‌వి‌డి లను పూర్తి వివరాలతో పోస్టులో కూడా పంపవచ్చును. పూర్తి వివరాలకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి 99497 00037 నంబర్ ను సంప్రదించవచ్చును. ఫిబ్రవరి 10వ తేదీలోగా తమ ఎంట్రీల్ని పంపాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. ప్రముఖ కవి సినీ విమర్శుకులు వారాల ఆనంద్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు.
రమేశ్ రెడ్డి,
filmcontest@scce.ac.in
కార్యదర్శి.చైతన్య విద్యా సంస్థలు
తిమ్మాపూర్, ఎల్.ఏం.డి. కాలనీ,
కరీంనగర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *