రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డితో సమావేశమైన ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇనిస్ట్యూట్ (IRRI)

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  పొచారం శ్రీనివాస రెడ్డితో సమావేశమైన ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇనిస్ట్యూట్ (IRRI), మనీలా, ప్రతినిధులు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిధ్యాలయం (PJTSAU) తో జాయింట్ ప్రాజెక్టు ప్రపోసల్ లో బాగంగా వరి పంటలో పరిశోధనలకు కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిన ప్రతినిధులు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో పండిస్తున్న పంటలలో వరి ముఖ్యమైనదని, అయితే ఉత్పాధకతలో ప్రాంతాల మద్య వ్యత్యాసం ఉన్నదన్నారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాలలో ఎకరాకు సగటు దిగుబడితో పోలిస్తే మన దేశంతో తక్కువగా ఉన్నదన్నారు. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే అదునాతన వంగడాలను రైతులకు అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో వినియోగం కన్నా అధికంగానే ఉన్నది. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలోని భారీ, మద్యతరహా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే వరి పంట విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. ఉత్పత్తితో పాటు ఉత్పాధకత కూడా పెరగాలంటే అధిక దిగుబడి నిచ్చే నూతన వంగడాలను రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పిలిప్పిన్స్ రాజదాని మనీల లోని IRRI ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరి పరిశోధనలకు స్థానిక విశ్వవిధ్యాలయాలు, సంస్థలతో కలిసి పనిచేస్తుని ప్రతినిధులు తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినివ్వడంతో పాటు, రోగనిరోధక శక్తిని కలిగే వంగడాలను రూపొందించడంలో సాంకేతిక సహకారాన్ని IRRI అందిస్తుందన్నారు. వరి పండించే దేశాలలో భారతదేశం ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి అనుకూలమైన రాష్ట్రం అయినందున రాష్ట్రంలోని ప్రఖ్యాత PJTSAU కలిసి పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉన్నామని ప్రతినిధులు తెలిపారు. విదివిధానాలను రూపొందించి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వ విన్నవిస్తామని ప్రతినిధులు తెలిపారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారదిIAS , కమీషనర్ యం. జగన్మోహన్ IAS, PJTSAU వైస్ చాన్సలర్ డా. ప్రవీణ్ రావు, డా. నఫీస్ మెహా, IRRI దక్షిణ ఆసియా ప్రతినిధి, ఇతర ప్రతినిధులు, సైంటిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *