Breaking News

రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ సంస్థ పాలక మండలి సమావేశం

రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ సంస్థ పాలక మండలి  సమావేశం

తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటి 8వ సాధారణ పాలక మండలి సమావేశం శ్రీ సి.పార్థ సారథి, IAS వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి గారి అధ్యక్షతన ఈ రోజు సంస్థ యొక్క సమావేశ మందిరంలో జరిగింది. ఈ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు నెలలకొకసారి జరిగే ఈ సమావేశంలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ కె. ధర్మయ్య పాటు, విత్తన పరిశోధన  సాంకేతికత కేంద్రం డైరెక్టర్, డాII నగేష్, ప్రివేటు విత్తన ఉత్పత్తిదారుల ప్రతినిధులు రమణ రావు, విత్తన రైతు ప్రతినిధి కొట్టాల చిన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, ధృవీకరణ విత్తన నాణ్యత ప్రమాణాలు పెరిగాయని, ఆన్ లైన్ సేవలు అద్భుతంగా ఉన్నాయని పాలకమండలి ప్రశంశించింది. మొబైల్ ఆప్ ను వచ్చేనెల మొదటివారంలో ప్రారంభించనున్నారని, విత్తన క్షేత్రాల తనిఖీలో వినియోగించనున్నారు. సహకార రంగంలో ధృవీకరణ విత్తనోత్పత్తిని ప్రోత్సహించేందుకు చార్జీలలో 40% రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. రాజేంద్రనగర్ లో నిర్మాణంలో ఉన్న ISTA ల్యాబ్ ను అత్యాధునిక పరికరాలతో సహా వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరీక్ష కొరకై నైపుణ్యం గల సిబ్బందిని నియమించటానికి నిర్ణయం తీసుకున్నారు. రాజేంద్రనగర్ మరియు కరీంనగర్ లో గల రెండు విత్తన పరీక్షా కేంద్రాలలో సౌర విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు అంగీకరించింది. అంతర్జాతీయ OECD విత్తన ధృవీకరణలో నైపుణ్యాభివృద్ధికై విదేశాలకు సాంకేతిక సిబ్బందిని విడతలవారిగా పంపించటానికి అంగీకరించింది. వచ్చేనెల మొదటివారంలో 3 నుండి 7 వరకు నిర్వహించే అంతర్జాతీయ విత్తన ధృవీకరణపై శిక్షణ కార్యక్రమం బాగా నిర్వహించాలని ఆదేశించింది. APEDA నుండి తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ ధృవీకరణ అథారిటికి అతీత్వరలో Accreditation రానున్న దృష్ట్యా సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణను ఎక్కువ ప్రాచూర్యంలోకి తెచ్చి పెద్దమొత్తంలో చేపట్టాలని నిర్ణయించింది. సంస్థకు సంబందించి 2018- 19 బడ్జెట్ ప్రణాళికను ఆమోదించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *